మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 22 జులై 2018 (11:01 IST)

సుఖసంతోషాలతో జీవించేందుకు. ఈ మెళకువలు పాటిస్తే సరిపోతుందట..?

సుఖసంతోషాలతో జీవించడం కోసం కొన్ని మెళకువలు పాటిస్తే సరిపోతుంది. ఆనందమయ జీవితం గడపడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. జీవితంలో సంతోషంగా వుండాలంటే.. మీ కలలను సాధ్యం చేసుకునేందుకు లక్ష్యాలన

సుఖసంతోషాలతో జీవించడం కోసం కొన్ని మెళకువలు పాటిస్తే సరిపోతుంది. ఆనందమయ జీవితం గడపడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. జీవితంలో సంతోషంగా వుండాలంటే.. మీ కలలను సాధ్యం చేసుకునేందుకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఆపై ప్రయత్నాలు చేయాలి. కుటుంబ సభ్యులు ఏదైనా పనిచేస్తున్నప్పుడు వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. 
 
ఆ మద్దతు వారిని జీవితంలో ముందడుగుకు కారణమవుతుంది. అలాగే చుట్టూ వున్న వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగాలి. ఎప్పుడైనా ఏదైనా తప్పిదం జరిగినా దాన్ని సులభంగా మర్చిపోండి. జీవితంలో ఎదురైన అపజయాలను విజయాలుగా మార్చుకునేందుకు యత్నించడం ద్వారా ఆనందంగా గడపవచ్చు. రోజులో కొంత సమయాన్ని మీ కోసం మీకు నచ్చిన పనిపై వెచ్చించాలి.
 
ఆరోగాన్ని కాపాడుకోవటం ద్వారా కూడా ఆనందంగా జీవించవచ్చు. స్థూలకాయం వల్ల పోషకాహారం తినలేకపోతున్నామనే భావన కూడా సంతోషాన్ని దూరం చేస్తోంది. దానికి వ్యాయామం చేస్తూ కోరుకున్న ఆహారపదార్థాలు తింటూ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. ఇక సెలవు రోజు పిల్లలతో గడపటం చేయాలి. యోగా, ధ్యానం చేయడం ద్వారా సుఖమయ జీవితాన్ని గడుపవచ్చునని సైకలాజిస్టులు తెలిపారు.