1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2016 (09:27 IST)

తులసి ఆకులతో అజీర్ణం - గ్యాస్ సమస్యలకు చెక్

సాధారణంగా చాలా మందికి ఆహారం తిన్న వెంటనే కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. అంతకు ముందు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఇలాంటి వారు జీర్ణమయ్యేందుకు మాత్రలు వేసుకుంటున్నారు. కానీ, ఇంగ్లీష్ మందుల కంటే.. సహజ సిద్ధమైన పదార్థాలను తీసుకున్నట్టయితే, అజీర్ణం, గ్యాస్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. 
 
రోజుకు కేవలం ఒక 5, 6 తులసి ఆకులను తీసుకుని వాటిని బాగా నమలండి. ఇవి కడుపులో ఏర్పడే ఇబ్బందులను, అజీర్ణాన్ని, గ్యాస్ సమస్యలను తొలగిస్తాయి. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తాయి. తులసి ఆకుల్లో యాంటీ అల్సర్ గుణాలు ఉండటంతో గ్యాస్ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. 
 
రోజుకు 2, 3 కరివేపాలకు బాగా నమిలితే జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది. కడుపులో ఏర్పడే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని నమిలినా, వాటిని మరిగించి తయారు చేసిన ద్రవాన్ని తాగినా జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. పొట్టలో చల్లదనాన్ని పెంచడంలో పుదీనా బాగా ఉపయోగపడుతుంది. కడుపునొప్పి రాకుండా చేస్తుంది.