Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయాల్సిందే..?

Updated: గురువారం, 29 నవంబరు 2018 (13:14 IST)
చాలామంది నిద్రలేవగానే కాఫీ, టీ తెగ తాగేస్తుంటారు. అలా చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తున్నారు. అందువలన ఉదయం నిద్రలేవగానే దంతాలు శుభ్రం చేసిన తరువాతనే కాఫీ, పాలు, టీ మరేదైనా సేవించాలి. మీరు దంతాలు శుభ్రం చేసేందుకు వినియోగించే బ్రష్ సుతిమెత్తనిదై ఉండాలి.

ఒక వేళ మీరు వాడే బ్రష్ గరుకుగా లేదా కాస్త గట్టిదైతే దానిని కాసేపు వేడి నీటిలో ముంచి ఆ తరువాత బ్రష్ చేయాలి. లేదంటే దంతాలు నుండి రక్తం వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు నిపుణులు.   
 
ప్రతి రోజు ఆహారం తిన్న తరువాత మీ దంతాలను హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో శుభ్రపరచాలి. దీంతో మీ దంతాలలోనున్న చెడు బ్యాక్టీరియా తొలగిపోతాయి. దాంతో దంతాలు మరింత అందంగా తయారవుతాయి. కానీ మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో నోటిని శుభ్రపరిచే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోను మింగకూడదు. దీనిని నోట్లో వేసుకుని పుక్కిలించి ఉమ్మేయాలంటున్నారు వైద్యులు.
 
వీలైనంత వరకు చక్కెరను తక్కువగా ఉపయోగించాలి. చక్కెర ఎక్కువగా తీసుకుంటే అది నోటిలోని దంతాలను పాడు చేయడమే కాకుండా బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. అదే విధంగా చాక్లెట్స్ కూడా దంతాలను పాడుచేస్తాయి. వీటికి బదులుగా బాదంపప్పులు, ఎండు ద్రాక్షలను సేవించండి మంచి ఉపశమనం లభిస్తుంది.

దంతాలను శుభ్రం చేసిన తరువాత మీ నోట్లోని నాలుకను కూడా శుభ్రం చేసుకోండి. ప్రతి రోజూ టంగ్‌ క్లీనర్‌తో నాలుకను శుభ్రపరచుకోండి. ప్రతి రోజు ఉదయం, రాత్రి రెండు పూటలా దంతావధానం చేయాలంటున్నారు వైద్యులు. 

అన్నీ చూడండి

హైదరాబాద్‌లోనే మొట్టమొదటి డైరెక్ట్ మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్ ఎల్బీ నగర్‌లో ఏర్పాటు

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ కేసు: తొలుత ప్రియురాలు మాధురి సూసైడ్ ఎటెంప్ట్, ఇప్పుడు అదే దారిలో భార్య

యూపీఐ చార్జీలు కాదు.. యూపీఐ ట్యాక్స్ : రాహుల్ గాంధీ

శృంగారానికి నిరాకరించిన ప్రియురాలు.. ఆవేశంతో చంపేసిన ప్రియుడు...

వేధింపులు భరించలేక మామను హత్య చేసిన కోడలు.. కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments