మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (17:01 IST)

నెయిల్ పాలిష్ వాడుతున్నారా.. జాగ్రత్త..?

అమ్మాయిల నాజూకైన చేతివేళ్లను లేత బెండకాయలతో పోలుస్తుంటారు. అంత అందమైన చేతివేళ్లకు గోళ్లు కూడా అంతే సొగసుగా ఉండాలి కదా.. తరచుగా సబ్బునీళ్లలో, వంట పనిలో మునిగిపోయిన వారికి గోళ్లు మొరటుగా తయారౌతాయి. 
 
నెయిల్‌పాలిష్‌ వాడడం వలన గోళ్ళు అనారోగ్యం పాలవుతాయి. కాబట్టి గోళ్ళకు నెయిల్ పాలిష్ వాడకుండా మానేస్తే మంచిదని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో గోళ్ళకు ప్రాణ వాయువు శులభంగా లభిస్తుంది. మీ చేతి వేళ్ళను గోరువెచ్చని కొబ్బరినూనెతో వారానికి రెండుసార్లు మర్దన చెయ్యాలి. ఇలా చేయడం వలన  గోళ్లు ఆరోగ్యంగా ఎదుగుతాయి.
 
నెయిల్‌ పాలిష్‌ని అదేపనిగా వాడడం వలన కూడా గోళ్లు రంగు మారి అందవిహీనంగా తయారవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి. చర్మం మెత్తబడేలా చేసే లక్షణం నువ్వుల నూనెలో అధికంగా ఉంది. చేతిగోళ్లకు తరచుగా నువ్వులనూనెను రాయాలి. కొబ్బరినూనెను కూడా వాడొచ్చు. రోజూ దుస్తులు ఉతకాల్సి వస్తే మాత్రం చేతికి గ్లోవ్స్‌ ధరించాలి.. లేదంటే సబ్బు తాలూకు అవక్షేపాలు.. క్షారాలు చర్మాన్ని మొరటుగా మారుస్తాయి. 
 
అరకప్పు గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మకాయని పిండి అందులో 5 నిమిషాల పాటు చేతులను అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. సబ్బువాడకం మంచిది కాదు. కాస్త ఆరాక మాయిశ్చరైజర్‌ రాయాలి. ఇలా చేస్తే మీ గోళ్ళు ఆరోగ్యవంతంగా ఎదుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.