Daily Horoscope
✕

ఇవి తెలిస్తే మెంతి ఆకులను తినకుండా వుండరు

Written By సిహెచ్
Updated: గురువారం, 5 అక్టోబరు 2023 (21:52 IST)
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. మెంతి ఆకులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. పైత్యం అధికంగా ఉన్నప్పుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
 
కామెర్లు వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌‌తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. ‌నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
 
మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది. ‌మెంతిఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి. మెంతి‌ ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.

అన్నీ చూడండి

ఎప్పటినుంచో చనిపోదామనుకుంటున్నాం, ఇవాళ కుదిరిందంటూ గోడ మీద సూసైడ్ నోట్

చెన్నై మైలాపూరులో పట్టపగలే హత్య.. అడ్డంగా నరికేశారు.. కూల్‌గా వెళ్లిపోయారు..

అమరావతి ప్రతిష్టాత్మక రాజధాని.. అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించిన ఎంపీలు

దీపావళి పండుగ.. రాయితీ ధరలకు బియ్యం, కందిపప్పు, పామాయిల్.. చంద్రబాబు

ఉద్యోగులకు దీపావళి బంపర్ బహుమతులుగా కార్లు

అన్నీ చూడండి

Nivetha Pethuraj: ఆ కథ తెలియదు.. తెలియకుండానే నటించాను.. నివేదా పేతురాజ్

ఆ దుస్తులేంటి నజ్రియా.. భర్త ఫహద్ ఫాసిల్‌తో విడాకులు తీసుకుంటుందా?

Sita Controversy: నయనతారకున్న అంకితభావం.. సాయిపల్లవికి ఎక్కడ?

హంతకుడిని కాదు.. ప్రేమికుడిని : షారూక్ 'కింగ్' నుంచి కొత్త పోస్టర్‌ రిలీజ్

ఆ విషయం తెలియగానే సెమిస్టర్‌ను మధ్యలోనే వదిలేసి వచ్చేశాడు : శిఖర్‌పై జాన్వీ కామెంట్స్

తర్వాతి కథనం
Show comments