మోతాదుకి మించి ఉప్పు అధికంగా తింటే ఏమవుతుందో తెలుసా?
ఉప్పు. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకుమించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి.
రక్తపోటు పెరుగుతుంది. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడటం కారణం అవుతుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.
కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంటుంది. శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది. పక్షపాతం వచ్చే ప్రమాదం సైతం వుంటుంది.