Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

హెల్త్ టిప్స్ : శరీరంలో అయోడిన్ లోపిస్తే...

Written By వరుణ్
Published: మంగళవారం, 30 జనవరి 2024 (14:49 IST)
మానవ శరీరానికి అయోడిన్ ఎంతో కీలకం. అలాంటి అయోడిన్ లోపిస్తే శరీరానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా, థైరాయిండ్ హార్మోన్ ఉత్పత్తికి ఇది ఎంతో కీలకం. అందుకే ఈ పోషకం లోపిస్తే, మెటబాలిజం సమస్యలు వేధిస్తాయి. మన శరీరం స్వతఃసిద్ధంగా అయొడిన్‌ను తయారు చేసుకోలేదు. కాబట్టి మనం ఆహారం ద్వారా సరిపడా అయొడిన్ శరీరానికి అందేలా చూసుకోవాలి. ఈ పోషకం లోపాన్ని ఈ లక్షణాలు ద్వారా కనిపెట్టి వెంటనే సరిదిద్దుకోవాలి. 
 
గుండె ఆరోగ్యం : అయొడిన్ తగ్గడం వల్ల గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. దాంతో తల తిరగడం, నిస్సత్తువ ఆవహించడం వంటి సమస్యలు వేధిస్తాయి. 
 
మలబద్ధకం : జీర్ణవ్యవస్థ పనితీరుకు థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోను విడుదల చేయాలి. అయొడిన్ లోపంతో హార్మోన్ ఉత్పత్తి తగ్గడం మూలంగా మలబద్ధకం మొదలవుతుంది. 
 
గర్భధారణ : అయొడిన్ లోపంతో థైరాయిడ్ హార్మోన్ స్రావం తగ్గడం వల్ల గర్భధారణ సాధ్యపడదు. అలాగే గర్భంలోని బిడ్డ నాడీ సంబంధ ఎదుగుదలకు కూడా అయొడిన్ అవసరం. కాబట్టి గర్భం దాల్చాలనుకునే మహిళలు, గర్భిణులు థైరాయిడ్ హార్మోన్ సరిపడా ఉత్పత్తయ్యేలా ఆహారంలో అయొ ఉండేలా చూసుకోవాలి. 
 
మెడవాపు : అయొడిన్ లోపం ప్రధాన లక్షణం మెడ వాపు. థైరాయిడ్ గ్రంథి వాపు ద్వారా ఈ లోపం బయల్పడుతుంది. 
 
డిప్రెషన్ : మానసిక కుంగుబాటు, యాంగ్జయిటీలు కూడా అయొడిన్ లోపం లక్షణాలే! 
 
ఆహారంతో : అయొడిన్ లోపాన్ని అయొడిన్ కలిగి ఉండే ఉప్పుతో సరిదిద్దుకోవచ్చు. హైపోథైరాయిడ్ జీవనశైలి సమస్య కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో థైరాయిడ్ హార్మోన్‌ను మాత్రల రూపంలో తీసుకుంటూ ఉండాలి. 

అన్నీ చూడండి

సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా.. భారతీయుడి పౌరసత్వం రద్దు

యువతిని అసభ్యంగా తాకుతూ ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే (వీడియో)

చేతులు లేని దివ్యాంగుడికి అన్నం తినిపించిన ఉద్యోగి.. శభాష్ గాయత్రీ అంటూ సీఎం ప్రశంస (Video)

October 07, 2026: బుధవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అందమైన అమ్మాయిలా పరిచయమై వృద్ధుడికి హనీట్రాప్, రూ. 38 లక్షలు లాగేసి...

అన్నీ చూడండి

Anupama Parameswaran: థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న క్రేజీ కల్యాణం మూవీ

Teja Sajja: ది ట్రెయిటర్స్ తెలుగు ట్రైలర్‌ రావడం ఆనందంగా ఉంది: హీరో తేజ సజ్జ

కామ్రేడ్ కళ్యాణ్ ప్రేమతో పడితే ఏమయిందనే పాయింట్ తో ట్రైలర్ రిలీజ్

NBK 111: దాదా- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ

Anil ravipudi: స్నేహితుల కథతో సరిపోయారు ఇద్దరూ టీజర్ విడుదల

తర్వాతి కథనం
Show comments