Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

చెడు కొలెస్ట్రాల్ తగ్గించే యాలుకలు

Written By సిహెచ్
Updated: మంగళవారం, 8 మార్చి 2022 (23:47 IST)
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రాత్రి ఒక యాలుకను తిని ఒక గ్లాసు వేడినీరు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అధిక బరువు, చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని హానికరమైన మలినాలు, వ్యర్థాలు తొలగిపోతాయి. అంతేకాకుండా రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్యను నివారిస్తుంది. మలబద్దక సమస్య నుండి విముక్తి పొందుతారు. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. నిద్రలో వచ్చే గురకను తగ్గిస్తుంది.

 
యాలుకలు శృంగార జీవితంలో ఏర్పడే అపశృతులను తొలగిస్తాయి. అంతేకాకుండా వీర్యంలో శుక్రకణాల వృద్ధికి తోడ్పడుతాయి. శృంగార జీవితానికి యాలుకలు ఒక శక్తివంతమైన టానిక్ అని చెప్పవచ్చు.

 
చర్మసౌందర్యానికి కూడా యాలుకలు ఉపయోగపడతాయి. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యలను తగ్గించి వెంట్రుకలను కుదుళ్ల నుండి బలోపేతం చేసి ఆరోగ్యవంతమైన జుట్టు పెరిగేలా దోహదపడుతుంది. ఇలా అనేక ప్రయోజనాలను కలిగిన యాలుకలను ఆహారంలో తీసుకుంటే మేలు కలుగుతుంది.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments