మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 17 జులై 2021 (13:15 IST)

గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు యాలుకల పొడిని వేసుకొని త్రాగితే...

క్యాల్షియం లోపం చాలామందిలో తలెత్తుతున్న సమస్య. ఈ సమస్యతో ఎముకలు బలహీనంగా మారుతాయి. ఫలితంగా కీళ్లనొప్పులు, ఎముకలు పెళుసుబారిపోవడం తదితర సమస్యలు వస్తాయి. అందుకే క్యాల్షియం పుష్కలంగా వున్న పదార్థాలను తీసుకుంటూ వుండాలి.
 
యాలుకలలో పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు యాలుకల పొడిని వేసుకొని ప్రతిరోజు త్రాగటం వలన ఎముకలు ధృడంగా తయారవుతాయి.
 
అంజీరపండ్లను, నారింజ పండ్లను క్రమంతప్పకుండా తీసుకోవాలి. దీనిలో ఉన్న కాల్షియం రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.
 
పాలు, పెరుగు, జున్నులో కాల్షియం శాతం ఎక్కువుగా ఉంటుంది. వీటిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
రాగి పిండిని జావా లాగా చేసి ప్రతి రోజు త్రాగటం వలన దానిలో ఉన్న పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచి, పిల్లలలో ఎముకల పెరుగుదలకు కావలసిన కాల్షియంను అందిస్తాయి.
 
పాలకూర, తోటకూర, బ్రోకలి లాంటి ఆకుకూరల్లో డి విటమిన్, కాల్షియం ఎక్కువుగా ఉండి అది ఎముకలను పటిష్టంగా ఉంచుతుంది. కనుక వారంలో మూడుసార్లయినా ఆకు కూరలను తినటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.