భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగేస్తే..?
చాలామంది భోజనం చేసేటప్పుడు మధ్యలో ఎక్కువగా నీళ్ళు తాగేస్తుంటారు. నాలుగు ముద్దలు తిన్న వెంటనే ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల అది అనారోగ్యానికి కారణమవుతుందట. భోజనం చేసిన తరువాత నీళ్ళు తాగకూడదు అంటారు. అలాగే భోజనానికి ముందే ఎక్కువగా నీళ్ళు తీసుకోకూడదు అంటారు. అసలు ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే...
భోజనం ముందు కూర్చున్నప్పుడు నీళ్ళు ఎక్కువగా తాగకూడదట. అలాగే ఒకసారి అన్నం తినడం ప్రారంభించిన తరువాత సిప్‌లు సిప్‌లుగా నీళ్ళు తాగాలే తప్ప ఒకేసారి నీళ్ళు తాగితే అది కాస్త క్రొవ్వుగా మారి అనారోగ్యానికి కారణమవుతుందట. అంతేకాదు హెవీ వెయిట్, పొట్ట ఉబ్బరంగా ఉండడానికి కారణమవుతుందట.
అలాగే భోజనం చేసిన తరువాత ఐదు నిమిషాలు ఆగి నీళ్ళు తాగాలట. అలా తాగడం వల్ల జీర్ణవ్యవస్ధ బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగడం వల్ల కడుపులో ముద్దలాగా మారి జీర్ణ వ్యవస్థకు ఇబ్బందిగా మారుతుందని చెపుతున్నారు.