శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 29 ఆగస్టు 2022 (22:57 IST)

చల్లని నీటిని తాగటం కంటే గోరువెచ్చని నీరు మంచిదా?

water
గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల లాభాలు వున్నాయి, అలాగే కాస్తాకూస్తో ఇబ్బందులు కూడా ఉన్నాయి. గోరువెచ్చని నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో వున్న మలిన పదార్థాలను వేగంగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఐతే గోరువెచ్చని నీరు తాగడం వల్ల దాహం తగ్గుతుంది. మీ శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోయే అవకాశం ఉన్నందున ఇది వేడి ఉష్ణోగ్రతలలో సమస్య కావచ్చు.

 
సాధారణంగా, చల్లని నీరు హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయినప్పటికీ జలుబు లేదా ఫ్లూ ఉన్నప్పుడు చల్లటి నీరు తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది రికవరీని నెమ్మదిస్తుంది. చల్లటి నీరు పెద్దవారిలో జీర్ణక్రియను నెమ్మదిచేస్తుంది. వ్యాయామం తర్వాత చల్లటి నీటిని తీసుకోవచ్చు. ఐతే భారీగా భోజనం చేసినప్పుడు గోరువెచ్చని మంచినీరు తాగడం మేలు అంటున్నారు నిపుణులు.