సోమవారం, 2 అక్టోబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (17:32 IST)

ఎర్రబెండకాయ గురించి మీకు తెలుసా?

Red Lady Finger
Red Lady Finger
ఎర్రబెండకాయ గురించి మీకు తెలుసా? ఇందులోని పోషకాలను గురించి తెలుసుకోవాలనుందా.. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఎరుపు బెండకాయల్లో 21 శాతం ఇనుము, 5 శాతం ప్రొటీన్లు ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 
 
మన ఇళ్లలో ప్రధాన ఆహారంగా ఉపయోగించే బెండకాయలు ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కానీ, ఇప్పుడు కొత్త ఎరుపు బెండకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చాలా ఏళ్ల పరిశోధనల తర్వాత ఎర్రబెండను అభివృద్ధి చేసినట్లు సమాచారం. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 
 
అలాగే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, ఫోలిక్ యాసిడ్ కలిగివుంటుంది. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగపడతాయి. ఎరుపు బెండలో ఉండే ఐరన్, కాల్షియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. 
 
రెడ్ బెండను తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు అనేక వ్యాధులను అదుపులో ఉంచడంలో ఎరుపు బెండకాయలు ఎంతగానో సహకరిస్తాయి. 
 
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు, ఎముకలు, కీళ్లలో అరుగుదల ఉన్నవారు ఈ ఎర్ర బెండను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీర స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు. ఎర్ర బెండలో అధిక ఫైబర్ కంటెంట్ వుంటుంది. అలాగే అల్సర్‌లను దూరం చేస్తుంది. పేగు సమస్యలను దూరం చేస్తుంది.
 
చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. విటమిన్లు A, C, B కాంప్లెక్స్‌లతో సమృద్ధిగా వుండే ఈ ఎరుపు బెండను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.