గురువారం, 21 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (14:51 IST)

మెంతికూర ఆరోగ్య ప్రయోజనాలు.. కొలెస్ట్రాల్, మధుమేహం పరార్

Fenugreek Seeds
మెంతికూరలో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మెంతులను ఆహారంలో తరచూ వాడటం వల్ల రుచితో పాటు అనేక సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఎన్నో ఔషధ గుణాలున్న మెంతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులు వంటకాల రుచిని పెంచడంతో పాటు మధుమేహాన్ని నియంత్రించగలవు.

చర్మం, జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్లో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి. ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి, కె, బి, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, రాగి, జింక్, ఫైబర్ తదితర పోషకాలు మెంతికూరలో సమృద్ధిగా లభిస్తాయి.

మెంతి ఆకలి, జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. బాలింతలకు ఎంతో మేలు చేస్తాయి. మెంతులు లేదా మెంతికూర తరచుగా తినడం వల్ల మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. అందుకే షుగర్ కంట్రోల్ కోసం పరిగడుపున కొన్ని మెంతులు తినాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

మెంతులు కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు రక్తపోటును మెరుగుపరుస్తుంది. వెన్నునొప్పి, మోకాలి కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిరి, శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పిని నయం చేయడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.