1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 24 ఆగస్టు 2022 (22:34 IST)

పాపులర్ నటి సోనాలి ఫొగట్ గుండెపోటుతో మృతి, హార్ట్ ఎటాక్ లక్షణాలు ఏమిటి?

sonali phogat
హర్యానా భాజపా నాయకురాలు, పాపులర్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనాలి ఫొగట్ గుండెపోటుతో కన్నుమూశారు. నిజానికి ఆమె ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటారని చెపుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, తినే తిండిలో జాగ్రత్తలు అన్నీ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే గుండెపోటుకి కారణాలు ఇవికాకపోయినా మరే ఇతర కారణం అవుతుంది. గుండెపోటు వచ్చేముందు ఖచ్చితంగా దాని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

 
గుండెపోటుకు వచ్చినవారిలో కనీసం వారం రోజుల  ముందే మూడింట ఒక వంతు మందికి దాని లక్షణాలను అనుభవిస్తారని గుండె నిపుణులు పేర్కొంటున్నారు. ఒక వ్యక్తి వెంటనే లక్షణాలను గుర్తిస్తే, ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. సరిగ్గా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, ఛాతీ నొప్పి ఉంటే, విపరీతంగా అలసిపోయినట్లు అనిపిస్తే కొన్ని లక్షణాలపై శ్రద్ధ వహించండి. ఈ సందర్భంలో వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

 
భుజం లేదా మెడలో నొప్పి కూడా దాని లక్షణం. అలాగే ఆకస్మిక చెమట, పెరిగిన బద్ధకం, అలసట వంటి లక్షణాలు కనబడతాయి. గుండెపోటు అనేది సాధారణ వ్యాధి కాదు. ఇది సమస్య ప్రారంభం కాగానే సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. పేలవమైన జీవనశైలి కారణంగా గుండె జబ్బును కలిగిస్తాయి. కనుక తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పౌష్టికాహారం తినాలి, అధిక మొత్తంలో కొవ్వు ఉన్న వాటికి దూరంగా ఉండాలి. ఆహారంతో పాటు, వ్యాయామం గురించి కూడా శ్రద్ధ వహించాలి. ప్రతిరోజూ దాదాపు నూట యాభై నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ ఏదైనా శారీరక శ్రమ చేయాలి, ఇది శరీరాన్ని అలాగే గుండెను ఫిట్‌గా ఉంచుతుంది.