1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 25 డిశెంబరు 2021 (22:30 IST)

రాత్రిపూట గోరువెచ్చని నీటితో నిమ్మరసం తాగడం మంచిదా?

రాత్రిపూట గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగితే మంచిదేనా అనే సందేహం వుంటుంది. ఈ నిమ్మరసాన్ని తాగితే పడుకునే ముందు విశ్రాంతిని కలిగించి చక్కటి నిద్రకు సహాయపడుతుంది. ఇది సాధారణ ఆర్ద్రీకరణకు కూడా సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది కనుక శారీరక విధులను సక్రమంగా నిర్వహించేట్లు చేస్తుంది.
 
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువును నియంత్రించడంలో నిమ్మరసం దోహదం చేస్తుంది. కిడ్నీ స్టోన్స్ నివారిస్తాయి. అలాగే రక్తహీనత నుండి రక్షిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.