1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:03 IST)

పరగడుపునే నిమ్మరసం తీసుకుంటే....??

చాలా మంది ఉద‌యాన్నే వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగి రోజు మొద‌లు పెడ‌తారు. దీంతో నిద్ర మ‌త్తు వ‌దిలి యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చ‌ని వారి భావ‌న‌. అయితే ఆరోగ్య‌ప‌రంగా చెప్పాలంటే ఉద‌యాన్నే ఈ డ్రింక్స్‌ను తాగడం అంత మంచిది కాదు.

వీటితో జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలా కాకుండా ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే చాలా ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్రయోజనాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగితే శ‌రీరంలో ఉండే విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది.

2. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు రావు. తిన్న ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

3. విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రావు. జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు వంటివి త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

4. శ‌రీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. అధికంగా ఉన్న బ‌రువు త‌గ్గుతారు.

5. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రుక‌లు ప్ర‌కాశ‌వంతంగా మారుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.