Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ, కాఫీ, పాలలో బెల్లం కలిపి తాగితే?

బెల్లం కలిపిన టీ, కాఫీ, పాలు తాగితే ఎముకలు, కండరాలు దృఢంగా వుంటాయి. బెల్లం కలిపిన పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. జీర్ణ సంబంధిత సమస్య ఉంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకుని తాగితే వెంటనే ఉపశమనం ల

Written By selvi
Updated: మంగళవారం, 19 డిశెంబరు 2017 (11:03 IST)
బెల్లం కలిపిన టీ, కాఫీ, పాలు తాగితే ఎముకలు, కండరాలు దృఢంగా వుంటాయి. బెల్లం కలిపిన పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. జీర్ణ సంబంధిత సమస్య ఉంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకుని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే బెల్లం కలిపిన పాలను తీసుకోవడంతో ఉపశమనం లభిస్తుంది. 
 
బాగా ఆడుకునే పిల్లలకు బెల్లం పాలు ఇస్తే తక్షణ శక్తి వచ్చి, ఉత్సాహంగా ఉంటారు. రోజూ పాలు తాగడం వల్ల క్యాల్షియం పెరిగి ఎముకలు బలంగా మారతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జుట్టును రాలనీయకుండా చేస్తుంది. నెలసరి నొప్పులను దూరం చేసుకోవాలంటే పాలలో బెల్లం కలుపుకుని తాగాలి. బెల్లం పాలు తాగితే హీమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు బెల్లం కలిపిన పాలు ఉపశమనాన్నిస్తుంది. 
 
పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసీ ఆకులు వేసి రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. బెల్లం, నెయ్యి సమపాళ్ళల్లో కలిపి తింటే మైగ్రేయిన్‌ తల నొప్పి తగ్గుతుంది. బెల్లం వల్ల కీళ్ళ ఇబ్బందులు రావని, శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

కిడ్నాప్ ఆరోపణల కేసు.. వైకాపా నేత షేక్ మహ్మద్ ముస్తఫా అరెస్ట్

దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులు

వెనిజువెలాలో భారీ భూకంపం... మృతుల సంఖ్య 6,125 పైమాటే...

సజ్జల నన్నే రావద్దంటారా? వైసిపి పార్టీ ఆఫీసు ముందు బోరుమంటూ బోరుగడ్డ అనిల్, వీడియో

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

అన్నీ చూడండి

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కుమార్తెకు దుర్గా సప్తశతి మంత్రాలను నేర్పిస్తున్న ప్రియాంకా చోప్రా

Trinadha Rao: సెట్‌కి వెళ్లేటప్పుడు ఫుల్లుగా బిర్యానీ తినేసేవాడ్ని.: త్రినాథరావు నక్కిన

తర్వాతి కథనం
Show comments