గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2017 (11:34 IST)

ఉసిరికాయ జ్యూస్ తాగితే.. నెలసరి నొప్పులకు చెక్

ప్రతిరోజూ ఉదయం ఉసిరికాయ జ్యూస్‌ను తాగడం ద్వారా మదుమేహం తగ్గుతుంది. ఉసిరికాయ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి, క్రోమియంలు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా షుగర్ అదుపులోకి వస్తుంది. డయాబెటి

ప్రతిరోజూ ఉదయం ఉసిరికాయ జ్యూస్‌ను తాగడం ద్వారా మదుమేహం తగ్గుతుంది. ఉసిరికాయ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి, క్రోమియంలు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా షుగర్ అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ వ్యాధి ఉన్న వారికి కూడా ఉసిరికాయ మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అలాగే ఉసిరి జ్యూస్‌ను మహిళలు నెలసరి సమయంలో తీసుకుంటే వెన్ను నొప్పి, కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యాన్సర్ కణాలపై పోరాడే శక్తి ఉసిరికాయ జ్యూస్‌లో వుంది. 
 
ఇందులో వుండే యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను వృద్ధి చెందనీయవు. ఉసిరికాయ జ్యూస్‌ను  తాగడం ద్వారా బరువు తగ్గొచ్చు. ఎలాగంటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను ఇది తొలగిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తద్వారా గుండెపోటు దరిచేరదు.

అందుకే రోజూ పరగడుపున ఉసిరికాయ జ్యూస్‌ను తాగితే దాంతో శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. శరీర మెటబాలిజం ప్రక్రియను ఉసిరికాయ జ్యూస్ వేగవంతం చేస్తుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.