సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (11:45 IST)

సలాడ్స్ తీసుకోండి.. బరువు తగ్గండి..

బరువు తగ్గాలంటే సలాడ్ తప్పక తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సలాడ్‌లో వుండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. పండ్లు, కూరగాయలతో కూడిన సలాడ్స్ ద్వారా బరువు తగ్గవచ్చు. కూరగాయల సలాడ్స్ శరీరంలో కొవ్వు పదార

బరువు తగ్గాలంటే సలాడ్ తప్పక తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సలాడ్‌లో వుండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. పండ్లు, కూరగాయలతో కూడిన సలాడ్స్ ద్వారా బరువు తగ్గవచ్చు. కూరగాయల సలాడ్స్ శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. సలాడ్స్‌లో మొలకెత్తిన విత్తనాలను కలపడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మొలకెత్తిన ధాన్యాలు ఫైబర్, ప్రోటీన్, విటమిన్లను శరీరానికి అందిస్తాయి. 
 
శరీరానికి ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను సలాడ్స్ అందిస్తాయి. పచ్చి కూరగాయలతో చేసే సలాడ్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచటమేకాకుండా, రోగ నిరోధక వ్యవస్థ శక్తిని కూడా పెంచుతాయి. రోజూ మనం తీసుకునే ఆహారంలో కూరగాయలను, పండ్లను తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
తరచుగా సలాడ్‌లను తినే వారిలో గుండె సంబంధిత వ్యాధులు దూరంగా వుంటాయి. అందుకే స్ట్రాబెర్రీ, టమోటా, క్యారెట్, ఆపిల్, బీన్స్, పీస్, మిరియాలతో సలాడ్స్ తీసుకుంటే గుండెకు మేలు చేసిన వారవుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.