ఆఫీసులో అలసిపోతున్నారా? బొప్పాయి ముక్కలు తినండి
ఆఫీసులో అలసిపోతున్నారా? ఒత్తిడి వేధిస్తుందా..? అయితే ఒక కప్పులో బొప్పాయి పండ్లను ఇంటి నుంచి తెచ్చుకుని తినాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇంటికెళ్లిన వెంటనే కాఫీలు, టీ తీసుకోకుండా ఒక కప్
ఆఫీసులో అలసిపోతున్నారా? ఒత్తిడి వేధిస్తుందా..? అయితే ఒక కప్పులో బొప్పాయి పండ్లను ఇంటి నుంచి తెచ్చుకుని తినాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇంటికెళ్లిన వెంటనే కాఫీలు, టీ తీసుకోకుండా ఒక కప్పు బొప్పాయి ముక్కలను తీసుకోవడం చేయాలి. బొప్పాయిలో వుండే విటమిన్ సి.. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అంతేగాకుండా విటమిన్ సి.. ఒత్తిడిని కలిగించే హార్మోన్లను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బొప్పాయి మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తుంది.
మధుమేహం రాకుండా వుండాలంటే రోజూ ఒక కప్పు బొప్పాయి పండ్లను తీసుకోవాలి. అలాగే బొప్పాయి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. బొప్పాయి పండు వయసు మీరిన కొలది కలిగే సమస్యలను దూరం చేస్తుంది. యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇందులోని విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీయాక్సిడెంట్లు, బీటా-కెరోటినాయిడ్ వంటివి ఫ్రీ-రాడికల్ వల్ల చర్మంపై ఏర్పడే ప్రమాదాన్ని దూరం చేస్తాయి.
రోజులో రెండు సార్లు బొప్పాయి పండు తినటం వలన అనారోగ్యాలు దూరం అవుతాయి. బొప్పాయి పండు ఫైబర్‌ను అధికంగా కలిగి ఉండటం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.