గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (08:13 IST)

కరివేపాకు, పెరుగు పేస్టుతో జుట్టుకు మేలెంత?

కరివేపాకు ఆకులతో శిరోజాలకు ఎంతో మేలు చేకూరుతుంది. కరివేపాకు ఆకులను పావుకప్పు తీసుకుని వాటిని పేస్టులా చేసుకుని.. అందులో పెరుగుకు చేర్చి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల అలానే వుంచి తర్వాత స్నానం చేస్తే

కరివేపాకు ఆకులతో శిరోజాలకు ఎంతో మేలు చేకూరుతుంది. కరివేపాకు ఆకులను పావుకప్పు తీసుకుని వాటిని పేస్టులా చేసుకుని.. అందులో పెరుగుకు చేర్చి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల అలానే వుంచి తర్వాత స్నానం చేస్తే జుట్టు రాలదు. జుట్టు మృదువుగా తయారవుతాయి. అలాగే నీటిలో కరివేపాకు ఆకులను మరిగించి ఆ రసానికి నిమ్మరసం, చక్కెర కలపాలి. దీన్ని వారం రోజుల పాటు పరగడుపున తింటే జుట్టు పెరుగుతుంది. 
 
ఈ టీ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. తాజా కరివేపాకు ఆకులు, కొబ్బరినూనెలను ఒక గిన్నెలో తీసుకోవాలి. రెండింటినీ కలిపి నలుపు రంగు మిశ్రమం వచ్చే వరకు మరిగించాలి. ఆపై చల్లబరిచి జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమం జుట్టును త్వరగా తెల్లబడనీయకుండా చేస్తుందని హెయిర్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.