శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 మే 2020 (11:32 IST)

కరోనా లాక్ డౌన్.. రాత్రిపూట లేటుగా తింటే అంతే సంగతులు..

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆహారం తీసుకునే వేళల్లో అధిక శ్రద్ధ వహించాలి. సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట సరైన ఆహారం తీసుకోవాలి. సరైన సమయానికి నిద్రపోవాలి. లేకుంటే ఒబిసిటీ, హృద్రోగ సమస్యలు వంటివి తప్పవు. ముఖ్యంగా రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సులు అధికంగా ఉన్నాయి. 
 
ఎక్కువగా రాత్రి పూట 9 గంటల తర్వాత భోజనం చేసే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పరిశోధనలు తేల్చాయి. అందుకే 9 గంటల లోపే భోజనం ముగిస్తే మంచిది. ఇంకా రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు తప్పవు. అందుకే రాత్రి పూట పడుకోబోయే మూడు గంటల ముందు ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.