మనిషి జీవిత చక్రంలో సమయం అత్యంత కీలకం.. వారంలో మీరు వెచ్చించే సమయమెంత?
సాధారణంగా మనిషి జీవిత చక్రంలో సమయం అత్యంత కీలకమైంది. దీని విలువ తెలుసుకుని నడుచుకుంటే జీవితంలో వృద్ధిలోకి వస్తారు. లేకుంటే.. సోమరిపోతుగానే జీవితాన్ని గడపక తప్పదు.
సాధారణంగా మనిషి జీవిత చక్రంలో సమయం అత్యంత కీలకమైంది. దీని విలువ తెలుసుకుని నడుచుకుంటే జీవితంలో వృద్ధిలోకి వస్తారు. లేకుంటే.. సోమరిపోతుగానే జీవితాన్ని గడపక తప్పదు. అలాంటి విలువైన సమయంలో మీరు వృధా చేసే సమయం విలువ నేటి యువత తెలుసుకోవాల్సిందే. లేకుంటే వారి జీవితాలు వ్యర్థం కావడం ఖాయమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఉదాహరణకు ఒక వారం రోజులకు 168 గంటలు. ఇందులో 60 రోజులు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే చాలా గొప్ప అని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. 168 గంటల్లో టీవీలు చూడటం, స్నానాలు చేయడానికి, కాలకృత్యాలు తీర్చుకునేందుకు, సిన్మాలు షికార్లకు, తదితర పనులు మినహాయించి 60 గంటలు సద్వినియోగం చేసుకుంటే ఎంతో సమయం సద్వినియోగం చేసుకున్నట్టేనని అభిప్రాయపడుతున్నారు.