గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (16:10 IST)

సెల్ ఫోన్ల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు.. ఒకే ఫోన్‌ను వాడొద్దు.. 80శాతం అక్కడే?

ఆస్పత్రులకు వెళ్తున్నారా? ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండాలంటే సెల్ ఫోన్లను తీసుకెళ్లకండి. ఇది కాస్త కష్టమే అనుకుంటున్నారా? అయితే మొబైల్ ఫోన్‌ను ఆస్పత్రుల్లోకి ఎంటర్ అయ్యే ముందు బ్యాగుల్లో పెట్టేయండి అంటున్

ఆస్పత్రులకు వెళ్తున్నారా? ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండాలంటే సెల్ ఫోన్లను తీసుకెళ్లకండి. ఇది కాస్త కష్టమే అనుకుంటున్నారా? అయితే మొబైల్ ఫోన్‌ను ఆస్పత్రుల్లోకి ఎంటర్ అయ్యే ముందు బ్యాగుల్లో పెట్టేయండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పద్ధతిని ఆస్పత్రిలోనే కాదు.. ఇంట్లోనే అనుసరించాలి. అంతేకాదు.. ఒకే ఫోనును ఎక్కువమంది ఉపయోగించకూడదని వారు సూచిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే? ఆసుప‌త్రుల్లో ఉన్న‌ పేషెంట్లకు ఏమాత్రం ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు సిబ్బంది జాగ్ర‌త్త‌లు తీసుకుంటారనే విషయం తెలిసిందే.
 
అయితే ఆసుప‌త్రుల్లో సెల్‌ఫోన్ల వాడకం వల్ల 81.8 శాతం బ్యాక్టీరియల్ పాథోజెన్‌లు వ్యాప్తి చెందుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ఇక హ్యాండ్ స్వాబ్‌ల వల్ల 80 శాతం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నాయని కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడించింది. ఈ స‌ర్వే అనంత‌రం ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి పాటించాల్సిన సూత్రాలను తెలుపుతూ ఐసీఎంఆర్ ప‌లు సూచ‌న‌లు విడుదల చేసి, వాటిని ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌లో ఉంచారు. 
 
ఇక ఇందుకు కారణాలు కూడా చెప్పింది. ఒకే మొబైల్ ఫోనును ఎక్కువమంది ఉపయోగించడం ద్వారానే ప్రధానంగా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. ఒక‌ మొబైల్ ఫోన్‌ని ఒకరు వాడినప్పుడు వాళ్ల చేతులకు ఉండే బ్యాక్టీరియా ఫోన్‌కు అంటుకుంటుంది. అలాగే సెల్ ఫోన్ యూజర్లు తమ చేతుల్ని శుభ్రం చేసుకోకుండానే ఫోనును ఉపయోగించడం.. ఆ ఫోనును వేరొకరికి ఇవ్వడం ద్వారా ఇన్ఫెక్షన్లు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.