1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (11:09 IST)

సిక్స్‌ ప్యాక్‌కు సిద్ధమవుతున్నారా? ముందుగా మీ ఎముకల పటిష్టత గురించి తెలుసుకోండి?

ప్రస్తుతం యువత సిక్స్ ప్యాక్ కోసం తహతహలాడుతున్నారు. ఎక్కడ చూసినా, ఎవ్వరి నోట విన్నా సిక్స్ ప్యాక్ అనే మాటే యువత నోట వినపడుతోంది. బాలీవుడ్ హీరోలు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, టాలీవుడ్ హీరోలు నితిన్, అల్లు అర్జున్ తదితరుల మాదిరిగా తమ బాడీని షేప్ చేయించుకునేందుకు ఉర్రూతలూగుతున్నారు. 
 
సిక్స్ ప్యాక్ గురించి ఆలోచించడం దానిని ఆచరణలో పెట్టడం మంచిదే, కానీ అనుకున్న దానిని పూర్తిగా ఆచరణలో పెట్టి సాధించడంలోనే ఉంది గొప్పతనం. సిక్స్ ప్యాక్ చేయాలనుకునే ముందు మీ శరీరంలోని ఎముకల పటిష్టత ఎంతమాత్రం ఉందనేది గుర్తించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. సిక్స్ ప్యాక్ కోసం వెళ్ళే ముందు మీ ఎముకల పటిష్టత కొరకు వ్యాయామం చేసి ఎముకలను వాటికి అనుగుణంగా మలుచుకోవాలి. దీనికి కొన్ని చిట్కాలు మీ కోసం:
 
ముందుగా మీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా తయారు చేసుకోవాలి. కార్డియోవాస్కులర్ వ్యాయామంతో మీ శరీరంలోని కండరాలు పుష్టిగా మారుతాయి. కాబట్టి కార్డియోవాస్కులర్ వ్యాయామం తప్పకుండా చేయాలి.
 
ప్రతి రోజు వ్యాయామం చేస్తుంటే కీళ్ళ నొప్పులు కూడా మీ దరిచేరవు. క్రమంగా ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం చేస్తుంటే శరీరంలో రక్త ప్రసరణ చాలా బాగుంటుంది. శరీరంలో ఎండార్ఫిన్ విడుదలౌతుంటుంది. ఇది ఒళ్ళు నొప్పులను తగ్గిస్తుంది. 
 
వెన్నునొప్పి, డిస్క్‌లలో వచ్చే నొప్పులు తగ్గాలంటే నడక చాలా మంచిదంటున్నారు వైద్యులు. నడకతో ఆరోగ్యంగా ఉంటారు. క్రింద పడిపోయిన ఏదైనా వస్తువును ఎత్తుకునేందుకు ముందుగా మీ మోకాలిని మడవాలి. ఏదైనా భారీ వస్తువులను పైకి ఎత్తాల్సివస్తే వాటిని మీ శరీరానికి దగ్గరకు తీసుకురండి. దీంతో వీపు కింది భాగంలో అంతగా భారం పడదు. 
 
అత్యంత బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు శరీరాన్ని ఒక్కసారిగా తిప్పకూడదు. బరువైన వస్తువులను లాగకూడదు, వీలైనంతవరకు తోయడానికి ప్రయత్నించాలి. వ్యాయామంతో ఫిట్‌గా తయారైంది అనిపిస్తే అప్పుడు ప్రారంభించండి సిక్స్ ప్యాక్ వ్యాయామం.