బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2017 (11:40 IST)

సూపర్ మార్కెట్లలో ప్రాసెస్డ్ మాంసం కొంటున్నారా?

చికెన్, మటన్, రొయ్యలు, చేపలు ప్రాసెస్ చేసినవి కొంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. సూపర్ మార్కెట్ నుంచి ప్రాసెస్డ్ మాంసం, రెడ్ మీట్ కొని వాడితే క్యాన్సర్ ప్రమాదం తప్పదని వారు హ

చికెన్, మటన్, రొయ్యలు, చేపలు ప్రాసెస్ చేసినవి కొంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. సూపర్ మార్కెట్ నుంచి ప్రాసెస్డ్ మాంసం, రెడ్ మీట్ కొని వాడితే క్యాన్సర్ ప్రమాదం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ అయిన మాంస పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కీడు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
తాజా అధ్యయనంలో ప్రాసెస్డ్ మాంసం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వస్తుందని తేలింది. డబ్బాలు, ప్యాకెట్లలో భద్రపరిచి.. రోజుల పాటు అలాగే వుండే మాంసాన్ని వాడటం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికీ, ప్రాసెస్డ్ రెడ్ మీట్‌కి సంబందం వుందని బ్రిటన్ పరిశోధకులు తేల్చారు. ఒక జంతువును మాంసం కోసం కోసే ముందు అది వ్యాధి రహితంగా వుందా లేదా అని పరీక్షించాల్సిన అవసరం వుందని బ్రిటన్ పరిశోధకులు అంటున్నారు. మాంసం కోసం కోసే జంతువులకు కంతులు వంటివి వుండకూడదు. అలా వుంటే మాత్రం క్యాన్సర్ ప్రమాదం తప్పదని పరిశోధనలో తేలింది.