సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రమాదకరం, అందుకే నిషేధం

మంగళవారం, 5 జులై 2022 (15:35 IST)
ఆరోగ్యంపై ప్లాస్టిక్ హానికర ప్రభావం చూపిస్తోందని వైద్యులు చెపుతున్నారు. అందువల్ల జూలై 1 నుంచి దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని అంటున్నారు. దేశంలో వ్యర్థ కాలుష్యానికి అతిపెద్ద వనరుగా ప్లాస్టిక్ మారింది. దేశంలో ఏటా దాదాపు 14 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వాడుతున్నారని, దీని కారణంగా వ్యర్థాలు పెద్దఎత్తున వ్యాపిస్తున్నాయని అంచనా. ప్రజల ఆరోగ్యానికి ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం. ప్లాస్టిక్ కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.

 
ప్లాస్టిక్ మన ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేస్తుంది. ప్లాస్టిక్ శతాబ్దాలుగా కుళ్ళిపోదు. ఇది నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, నేల కాలుష్యానికి కారణమవుతుంది. దీంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ సముద్రంలోకి చేరుతుంది. సముద్ర జంతువులు ప్లాస్టిక్‌ను మింగేస్తాయి. సముద్రం నుండి తీసిన చేపలు, ఇతర మత్స్య సంపదను తినడం వల్ల ప్లాస్టిక్ ముక్కలు మానవుల కడుపులోకి చేరి పేగులలో అడ్డంకులు ఏర్పడతాయి.

 
ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌లో ప్లాస్టక్ వల్ల చాలాసార్లు రసాయనాలు ఉపయోగించబడతాయి. దీని కారణంగా ప్రజల రోగనిరోధక శక్తి తీవ్రంగా ప్రభావితమవుతుంది. ప్రజలందరూ ప్లాస్టిక్ కవర్లు లేదా పాత్రలలో ఆహార పదార్థాలను ప్యాక్ చేయడం మానుకోవాలి. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా వెదురు లేదా గాజు సీసాలను నీటి కోసం ఉపయోగించాలి.

అన్నీ చూడండి

జూలై 10, 2026 తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

చేతికి అందివస్తాడని బెంగళూరుకి పంపితే బెట్టింగ్ యాప్ బానిసై తిరిగొచ్చాడు, కొడుకును చంపిన తండ్రి

విజయవాడలో ఆర్టీసీ ఓ వ్యక్తిని ఢీకొంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఖమ్మం బైపాస్ రోడ్డుపై 113 కిలోల గంజాయి పట్టివేత.. విలువ రూ.56లక్షలు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన కెనరా బ్యాంక్ సీజీఎం అలోక్ కుమార్ అగర్వాల్

అన్నీ చూడండి

Chiru, Bobby: వర్షంలో 12 గంటలు తడుస్తూ షూటింగ్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ మూవీ ఫ‌స్ట్ లుక్, 2027న సినిమా విడుద‌ల‌

Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి

Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

తర్వాతి కథనం
Show comments