ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 2 జులై 2022 (23:46 IST)

జొన్నరొట్టెలు ఎందుకు తినాలో తెలుసా?

Roti
మధుమేహంతో బాధపడేవారు జొన్నరొట్టెలు తింటే మంచిది. శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం వీటికి వుంది. గుండె ఆరోగ్యానికి జొన్నలు ఎంతో మేలు చేస్తాయి. జుట్టు ఒత్తుగా బలంగా వుండేందుకు జొన్న రొట్టెలను తినాల్సిందే.

 
జొన్నలు ఎంతో బలవర్ధకమైన ఆహారం. జొన్నపిండితో చేసిన రొట్టెలు రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బియ్యం, గోధుమలతో పోలిస్తే జొన్నల్లోనే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇనుము, ప్రోటీన్లు, పీచు పదార్ధాల్లాంటి పోషకాలుకూడా వీటిలో ఎక్కువ. గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం జొన్నల్లో ఉంది. ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. 

 
శరీరంలో ఉండే చెడు కొవ్వు తగ్గించే శక్తి జొన్నగింజల్లో ఉంది. ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావాల్సిన ఫాస్పరస్ ఒక కప్పు జొన్నల్లో లభిస్తుంది. నరాల బలహీనతను తగ్గించే గుణం జొన్నలకు ఉంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు జొన్నలు ఎక్కువగా వాడటం వల్ల తగ్గుతాయి. జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణశక్తిని పెంపొంది, అందుకు అవసరమైన హార్మోన్లను వృద్ధి చేస్తాయి.