శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (19:51 IST)

ఒక్క గ్లాస్ జ్యుస్ తో థైరాయిడ్ కు పరిష్కారం

ఈ ఒక్క గ్లాస్ జ్యుస్ తో థైరాయిడ్కి శాశ్వత పరిష్కరం లభిస్తుందట. శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒకటి. ఇది శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈగ్రంథి సరిగా పని చేయకపోవడం వల్ల మన శరీరంలో చాలా సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు.

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు మునగ అకుల జ్యుస్ ను తీసుకోవడం వలన థైరాయిడ్ సమస్య పూర్తిగా తోలిగిపోతుందని ఆయుర్వేదం చెప్తోంది. మునగాకులో ఎన్నో పవర్ ఫుల్ హెల్త్ బేనిఫిట్స్ దాగి ఉన్నాయి. సన్నగా, గుండ్రంగా ఉండే ఈ ఆకుల నుంచి పోషకాలు, విటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ “సి”, క్యాల్షియం, ప్రోటీన్, పుష్కలంగా లభిస్తాయి.
 
నాలుగు వేల సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ ఆకులను మెడిసిన్స్ లో ఉపయోగిస్తున్నారట. అంతేకాదు.. ఆయుర్వేదంలో మునగ ఆకును మూడు వందలకు పైగా వ్యాదులు నయం చేయడానికి ఉపయోగిస్తున్నారట. అందుకే దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్ గా పిలుస్తారు.

మునగ ఆకుల నుండి జ్యూస్ ఎలా తీయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మునగాకును గ్రైండ్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి చక్కగా గ్రైండ్ చేయాలి. ఇలా జ్యూస్ తయారు చేసుకున్నాక ఆ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లోకి వడపోసుకోవాలి.
 
ఈ మునగాకుల జ్యూస్ ని ప్రతిరోజు పరిగడుపున, ఇంకా భోజనానికి ముందు రెండు చెంచాలు తీసుకోవాలి. ఇలా చేయడం వలన మీ థైరాయిడ్ దూరం చేసుకోవచ్చు. ఈ మునగాకు రసం వల్ల ఒక థైరాయిడ్ సమస్య మాత్రమే కాదు దాదాపు మూడువందల రకాల జబ్బులను ఎదుర్కొనే వ్యాధినిరోధక శక్తి మీ శరీరానికి అందుతుంది.

ప్రతిరోజు సరైన మోతాదులో ఈ మునగాకు రసం తీసుకోవడం వలన ఎలాంటి జబ్బులు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యను ఎదుర్కొనే వారు కనీసం 40 రోజులు క్రమం తప్పకుండా ఈ రసాన్ని తీసుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుంది.