ముఖానికి మరింత కాంతిని చేకూర్చే స్ట్రాబెర్రీ - నిమ్మరసం ప్యాక్
స్ట్రాబెర్రీలు పండు ఆరోగ్యానికి మాత్రమే కాదు మగువల అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. దీంట్లో చర్మాన్ని కాపాడే ఆల్ఫా – హైడ్రాక్సీ ఆమ్లం పుష్కలంగా ఉంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇంకా వీటి ఉపయోగాలేంటో చూద్దాం!
స్ట్రాబెర్రీలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసి కొద్దిసేపు తర్వాత కడిగేసుకుంటే ముఖంపై పిగ్మెంటేషన్ ప్రభావాన్నినివారిస్తుంది.
అరటిపండు గుజ్జు, స్ట్రాబెర్రీలు, ఒక కప్పు పెరుగు, కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంది ముఖం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.
స్ట్రాబెర్రీలో కొద్దిగా శనగపిండి కలిపి ముఖానికి ప్యాక్‌గా వేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. అరకప్పు స్ట్రాబెర్రీ పండ్లలో కొంచెం తేనె, పసుపు, పాలమీగడ కలుపుకుని ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతిలీనుతుంది.