వేసవిలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి దుస్తులు ధరించాలి?
సాధారణంగా వేసవికాలంలో ప్రతి ఒక్కరూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. మరి నిండు గర్భంతో ఉన్న వారి పరిస్తితి అయితే మరింత దారుణంగా ఉంటుంది. కేవలం గర్భిణీ స్త్రీ మాత్రమే కాదు.. కడుపులో పెరిగే బిడ్డ కూడా ఇబ్బంది పడుతుంటాడు. ఇలాంటి వారు వేసవిలో ఎలాంటి దుస్తులు ధరించాలన్న అంశాన్ని పరిశీలిస్తే..
సాధారణంగా గర్భిణీలు వీలైనంతమేరకు వదులు దుస్తులనే ధరించాలి. అవికూడా మెత్తగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఈ దుస్తుల్లో లైట్ కలర్ దుస్తులు అయితే ఎంతో మంచిది. డార్క్ కలర్ దుస్తులు త్వరగా వేడిని గ్రహిస్తాయి.
అసలే ఉక్కపోత ఉన్న సమయంలో ఇలాంటి దుస్తులకు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం. కాటన్ లేదా లెనిన్ దుస్తులు చెమటను సులభంగా గ్రహిస్తాయి, ఎండ తీవ్రతను ఎదుర్కోవడానికి సహాయపడతాయి కాబట్టి వీలైనంత వరకు వాటినే ధరించాలి.