ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2017 (11:06 IST)

అధిక బరువుకు విటమిన్ 'ఇ'తో చెక్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

విటమిన్ ఇ.. నట్స్, కూరగాయలు, ఆకుకూరలు, సోయాబీన్, మొక్కజొన్న, కూరగాయలకు చెందిన నూనెలు, పదార్ధాల్లో పుష్కలంగా ఉంటాయి. వేరు శెనగలు, బ్రొకోలీ, కివీ ఫ్రూట్, మామిడి, టమోటాలు, పాలకూరలో విటమిన్ ఇ పుష్కలంగా ఉ

విటమిన్ ఇ.. నట్స్, కూరగాయలు, ఆకుకూరలు, సోయాబీన్, మొక్కజొన్న, కూరగాయలకు చెందిన నూనెలు, పదార్ధాల్లో పుష్కలంగా ఉంటాయి. వేరు శెనగలు,  బ్రొకోలీ, కివీ ఫ్రూట్, మామిడి, టమోటాలు, పాలకూరలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇంకా డైరీ ఉత్పత్తుల్లోనూ విటమిన్ ఇ లభిస్తుంది. విటమిన్ ఇని ఆహారంలో చేర్చుకుంటే.. దృష్టి లోపాలు తొలగిపోతాయి. క్యాన్సర్ కారకాలు నశిస్తాయి, గుండెపోటుతో పాటు హృద్రోగ సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా అధిక బరువును తగ్గిస్తుంది. 
 
అధిక బరువుతో బాధపడేవారు 'ఇ' విటమిన్ లోపమే కారణమంటున్నారు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక బరువు ఒత్తిడి, శారీరక రుగ్మతలు, ఆహారపుటలవాట్ల కారణంగా వస్తుందని వారు చెప్తున్నారు. ఒత్తిడి తట్టుకునేందుకు 'ఇ' విటమిన్ ఎంతో ఉపయోగపడుతుందట. 'ఈ' విటమిన్ తృణధాన్యాలు, ఆలివ్ నూనెల్లో బాగా లభిస్తుంది. 'ఇ' విటమిన్ లోపం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, మెటబాలిజమ్ సమస్యలు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.