1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (21:25 IST)

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగడం వల్ల 8 నష్టాలు, ఏంటవి?

green tea
గ్రీన్ టీ. కొవ్వు కరిగించుకోవాలని చాలామంది ఈ టీని ఇటీవలి కాలంలో తాగుతున్నారు. ఐతే మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే అది అనారోగ్యకరమైన ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
 
గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.
గ్రీన్ టీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు.
ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమికి కారణం కావచ్చు.
గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్‌ నొప్పికి కారణమవుతుంది.
గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు కూడా పెరుగుతాయి.
మితిమీరిన గ్రీన్ టీ మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది.
ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల మీ రక్తపోటు కూడా తగ్గుతుంది.