బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (13:17 IST)

ఐ ఫ్లూ నివారణకు హోం రెమెడీస్ తెలుసుకుందాం..

మారుతున్న కాలంతో పాటు అనేక రకాల కొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా క‌రోనా వైర‌స్ నుంచి ఐ ఫ్లూ వ‌ర‌కు ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. కానీ వర్షాల కారణంగా, భారతదేశంలో అంటువ్యాధుల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 
 
కంటి ఫ్లూ సమస్యలతో బాధపడేవారు ఖరీదైన వైద్యం కోసం వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని హోం రెమెడీస్‌తో ఇంట్లోనే సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆ హోం రెమెడీస్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
గ్రీన్ టీ బ్యాగ్స్: మనం తరచుగా గ్రీన్ టీ తాగుతాం. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఐ ఫ్లూ నుంచి తేలికగా ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. ఈ టీ బ్యాగ్‌లను గోరువెచ్చని నీటిలో నానబెట్టి, ఐ ఫ్లూ సోకిన కంటిపై ఉంచడం వల్ల త్వరలో మంచి ఫలితాలు వస్తాయి. వాపు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
 
పసుపు: కంటి ఫ్లూ సమస్యలతో బాధపడేవారికి కూడా పసుపు సమర్ధవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పసుపు అధిక మోతాదులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి దీనితో తయారు చేసిన మిశ్రమాన్ని దూదితో కళ్ల చుట్టూ నెమ్మదిగా అప్లై చేస్తే తేలికగా ఉపశమనం లభిస్తుంది. 
 
ఇంకా వాపు సమస్య నుంచి విముక్తి పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే, పిల్లలకు ఈ రెమెడీని ఉపయోగించే ముందు అనేక జాగ్రత్తలు పాటించాలి. దీన్ని అప్లై చేసిన తర్వాత కంటిలోకి పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.