1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 19 ఏప్రియల్ 2023 (16:17 IST)

లేత కొబ్బరి పిందెలు నీటిలో అరగదీసి ఆ గంధాన్ని మొటిమలపై మర్దన చేస్తే?

చర్మ సమస్యలకు, మొటిమలు, మచ్చలు తగ్గేందుకు చాలామంది ఏవేవో క్రీములు వాడుతుంటారు. ఐతే, మన పెరట్లో వున్న వాటితోనే చాలావరకు అనారోగ్య సమస్యలను నిరోధించవచ్చు. అలాంటి వాటిలో కొన్నింటిని చూద్దాం. తమలపాకు రసంలో సున్నం కలిపి పులిపిర్లు పైన పట్టిస్తే అవి క్రమేణా ఊడిపోతాయి.
 
రక్తచందనం, పసుపు సమానంగా కలిపి పాలలో కలిపి మొటిమలు పైన రాస్తే తగ్గిపోతాయి.
తులసి ఆకుల రసంలో కొద్దిగా బోరాక్స్ కలిపి ముఖంపైన మచ్చలు, మంగు పైన లేపనం చేస్తే అవి తగ్గిపోతాయి. పారిజాతం గింజలు, మెంతులు సమంగా కలిపి నూరి పెరుగుతో కలిపి పైన పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
 
లేత కొబ్బరి పిందెలు నీటిలో అరగదీసి ఆ గంధాన్ని మొటిమలపై రాస్తే అవి తగ్గుతాయి.
తల వెంట్రుకలు రాలిపోతుంటే ఆలివ్ ఆయిల్- మందార నూనెను సమంగా కలిపి తలకు రాస్తుంటే కేశాలు రాలడం తగ్గుతుంది. బెల్లం, సున్నం, కోడిగుడ్డు సొన సమానంగా కలిపి వాపులకు రాస్తుంటే అవి తగ్గిపోతాయి.