1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. monsoon diseases prevention, Remedies for Cold and Flu

వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, అడ్డుకునేందుకు చిట్కాలు

monsoon diseases prevention
వర్షాకాలం. ఈ వర్ష రుతువు ప్రారంభం కాగానే దానితో పాటే జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ తదితర సీజనల్ వ్యాధులు వెంటాడుతాయి. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలో తెలుసుకుందాము. వర్షాకాలంలో సాధ్యమైనంతవరకూ నీటిని కాచి చల్లార్చి తాగితే దాదాపు సీజనల్ వ్యాధులను అడ్డుకుంటాయి. వెల్లుల్లి, మిరపకాయలు తింటుంటే, వెల్లుల్లి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తే, మిరపకాయ సైనస్ రద్దీని తగ్గిస్తుంది.
 
విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఆహారంలో పుట్టగొడుగులు, నిమ్మ, తేనెను చేర్చాలి. జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రెడ్ మీట్, గుడ్లు, పెరుగు, తృణధాన్యాలు తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ సూప్ తీసుకుంటే, ఇది కఫాన్ని వదలగొడుతుంది.
 
రోజూ రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగాలి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ విషయంలో, ముక్కు దిబ్బడగా వున్నప్పుడు ఆవిరిని పీల్చుకోండి. రోజంతా గోరువెచ్చని నీరు త్రాగాలి. గొంతు నొప్పిగా వుంటే నీటిని పుక్కిలించండి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
అరటి పువ్వుతో ఆరోగ్యం.. వారానికి రెండు సార్లు తింటే..?