మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మే 2023 (09:53 IST)

జలుబు చేసిందని ఆవిరి పట్టింది.. చనిపోయింది.. ఎలా..?

steam
జలుబు చేసిందని ఆవిరి పట్టిన నర్సింగ్ విద్యార్థిని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడు, తూత్తుకుడి, ఆత్తూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆత్తూరు, పూమంగళంకు చెందిన మోది నాయకం ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఈయన భార్య ఓ టీచర్. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. చిన్నకూతురు కౌసల్య (18) నర్సింగ్ చదువుతోంది. 
 
కొన్ని రోజుల క్రితం ఈమెకు జలుబు చేసింది. ఇందుకోసం ఆమె ట్యాబ్లెట్లు వాడింది. పనిలో పనిగా ఆవిరిపట్టింది. ఇందుకోసం పెద్ద పాత్రలో తైలం వేసి ఇంట్లోని దుప్పటి కప్పుకుని ఆవిరిపట్టడం చేసింది. 
 
అయితే బెడ్ షీట్ కప్పుకోవడంతో గాలి లేకపోవడంతో.. ఊపిరాడక పోవడంతో ఆ వేడినీటిలోనే పడిపోయింది. చాలా సేపటికి కౌసల్య బెడ్ షీట్ కప్పుకున్నట్లే వుండటంతో అనుమానంతో బెడ్ షీట్ తొలిగించి చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. 
 
ఊపిరాడక అపస్మారక స్థితిలో వున్న కౌసల్యను ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు.