శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (18:27 IST)

బ్రాయిలర్ చికెన్ తింటే ప్రయోజనాలు ఏమిటి? (video)

చలికాలంలో వేడివేడిగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తింటుంటే ఆ టేస్టే వేరు. చికెన్ సూప్ ఈ సీజన్లో ఇష్టమైన భోజనంగా చాలామంది తీసుకుంటూ వుంటారు. నాటు కోడిని పక్కన పెడితే బ్రాయిలర్ చికెన్ అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వు పదార్థాలను కలిగి ఉంటుంది. బ్రాయిలర్ చికెన్ తింటే కలిగే కొన్ని ప్రయోజనాలు చూద్దాం.
 
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. బ్రాయిలర్ కోడి మాంసం తీసుకోవడం వల్ల హోమోసిస్టీన్ స్థాయిలను అణచివేసి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ చికెన్‌లో భాస్వరం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు బలోపేతం అవుతాయి.
 
బ్రాయిలర్ చికెన్‌లో ఉండే సెలీనియం శరీరం యొక్క జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది కండరాల పనితీరు, అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
 
బ్రాయిలర్ చికెన్‌లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంది. ఇది యాంటి డిప్రెసెంట్ అయిన సెరోటోనిన్‌లో సంశ్లేషణ చేయబడింది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటివారు బ్రాయిలర్ చికెన్ తింటే ఆ సమస్యలను అధిగమించవచ్చు.
 
ఐతే అదేపనిగా ఏ పదార్థం తిన్నా అనారోగ్యం కలుగుతుంది. కనుక చికెన్ బావుంది కదా అని అదేపనిగా తీసుకుంటే అనారోగ్యం కలుగుతుంది. కనుక వారానికి ఒకసారి మాత్రమే చికెన్ తీసుకుంటే మంచిది.