గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (22:47 IST)

మందార పొడిని మగవారు రెండు స్పూన్లు నోట్లో వేసుకుని...

మందారాలను బాగా ఎండబెట్టి మెత్తని పొడిలా చేయాలి. ఈ పొడి ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది. వీర్య కణాల సమస్యతో బాధపడేవారు ఈ మందార పొడిని రెండు స్పూన్లు నోట్లో వేసుకుని గ్లాసు పాలు తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా నలబై రోజుల పాటు తీసుకుంటే వీర్యకణాల సంఖ్య పెరిగి ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందవచ్చు.
 
నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. వారంలో రెండుసార్లు గుప్పెడు నువ్వులను తినడం వల్ల వీర్యంలో శుక్రకణాల సంఖ్య పెరుగుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు.'
 
మనం తినే ఆహారాన్ని ప్లాస్టిక్ వాటిల్లో పెట్టకూడదట. వాటిల్లో పెట్టినవి మగవారు తినడం వల్ల వీర్యం నాణ్యత తగ్గిపోతుందట. 
 
చికెన్, మటన్ వంటి మాంసం కన్నా చేపలు ఎక్కువగా తినే వారిలోనే వీర్యం నాణ్యంగా ఉంటుంది. దాంతో పాటు శుక్ర కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.
 
వ్యాయామం చేయని వారిలో వీర్యం సరిగా ఉండదు. నిత్యం గంట పాటు వ్యాయామం చేసే వారిలో వీర్యం నాణ్యంగా ఉండి శుక్రకణాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా శుక్రకణాలు బాగా యాక్టివ్‌గా ఉంటాయి.
 
టమోటాలో ఉండే లైకోఫిన్ వీర్యం మీద ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. టమోటాలు ఎక్కువగా తినే వారిలో వీర్యకణాల నాణ్యత పెరుగుతుందట.