మంగళవారం, 17 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 25 నవంబరు 2024 (14:25 IST)

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

బార్లీ నీరు. బార్లీని నీటిలో ఉడికించి, మిశ్రమాన్ని వడకట్టడం ద్వారా బార్లీ నీటిని తయారు చేయవచ్చు. రుచి కోసం నిమ్మరసం తేనె జోడించవచ్చు. అయితే, బార్లీ నీరు మూత్రవిసర్జన అవుతుంది కనుక మోతాదుకి మించి తాగకూడదు. బార్లీ వాటర్ ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇంకా ఈ బార్లీ నీటితో కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మసాలా పుడ్ తీసుకోవటం వలన కలిగే కడుపుమంటను బార్లీ వాటర్ తగ్గిస్తుంది.
బార్లీ యాంటీ-ఇన్ప్లమేటరీ లక్షణం కలిగి ఉంది కనుక కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ పానీయాన్ని ప్రతిరోజు తాగటం వలన వారి శరీరంలోని చక్కెరస్థాయిలు కంట్రోల్‌లో వుంటాయి.
ప్రతిరోజు ఒక గ్లాస్ బార్లీ నీరు తాగటం వలన రోజువారి మన శరీరానికి అవసరమయ్యే పీచుపదార్థం భర్తీ అవుతుంది.
బార్లీలో వుండే అధిక ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బార్లీ రక్తపోటును తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలు రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి ఈ పానీయాన్ని సేవించటం చాలా ఉపయోగకరం.
మూత్రపిండాలలో ఉన్న రాళ్లను బయటకు పంపించటంలో ఈ బార్లీ నీళ్లు ఎంతగానో సహాయపడతాయి.
అధికబరువును తగ్గించుకోవటంలో కూడా ఈ బార్లీ ఎంతగానో సహాయపడుతుంది.