తినాలంటే భయమేస్తుందా... ఇది పెట్టండి... తినొచ్చో లేదో చెప్పేస్తుంది...
వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా పాడయిపోతాయి. మాంసాహారం, చేపలతో వండుకున్నవి పాడయినట్లు మనకు అంత తేలిగ్గా తెలియదు. దాంతో కొన్నిసార్లు అవి పాడయినా తెలియక తినేసి సమస్యలు తెచ్చుకుంటాం. పాడైపోయిన పదార్థాలను ఇట్టే పట్టేసి ఓ పరికరం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింద
వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా పాడయిపోతాయి. మాంసాహారం, చేపలతో వండుకున్నవి పాడయినట్లు మనకు అంత తేలిగ్గా తెలియదు. దాంతో కొన్నిసార్లు అవి పాడయినా తెలియక తినేసి సమస్యలు తెచ్చుకుంటాం. పాడైపోయిన పదార్థాలను ఇట్టే పట్టేసి ఓ పరికరం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీని పేరు ఎలక్ట్రానిక్ నోస్.
ఈ పరికరాన్ని వాడటం ద్వారా మనం తినబోయే ముందు ఆ పదార్థం పాడయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అదెలాగంటే... ఆ పదార్థం నుంచి వెలువడే వాయువులను బట్టి పరికరం మనం వాటిని తినవచ్చో లేదో చెప్పేస్తుంది. ఆహారం విషతుల్యమైతే దాన్ని తినకూడదంటూ సంకేతాలు ఇస్తుంది.