శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (16:13 IST)

భారతదేశంలో మొదటిసారిగా ఒకేసారి కాలేయం- మూత్రపిండాల మార్పిడి చేసిన గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ హెల్త్‌ సిటీ

ఆసియాలోనే సుప్రసిద్ధమైన గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ హెల్త్‌ సిటీ (జీజీహెచ్‌సీ) విజయవంతంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాలేయ, మూత్రపిండాల మార్పిడిని చేసింది. కోవిడ్‌ 19 భారతదేశంలో వ్యాప్తి చెందుతున్న వేళ, జీవించి ఉన్న ఇద్దరు దాతల సహాయంతో ఈ శస్త్రచికిత్స చేశారు.
 
దాదాపు 35 సంవత్సరాల వయసు కలిగిన శ్రీ మిట్టల్‌ను ఢిల్లీ నుంచి జీజీహెచ్‌సీకి ఎయిర్‌లిఫ్ట్‌ చేశారు. ఆయనకు మూత్రపిండాలు విఫలం కావడంతో పాటుగా అతి తీవ్రమైన కాలేయ సమస్యలు(ఫ్యాటీ లీవర్‌) ఉన్నాయి. తక్షణమే ఆయనకు మూత్రపిండాలు, కాలేయం మార్పిడి చేయాల్సి ఉంది. న్యూఢిల్లీలోని ఆస్పత్రి ఆయనకున్న అతి తక్కువబీపీ, కార్డియాక్‌ షాక్‌ వంటి సమస్యలు కారణంగా వీటి మార్పిడి కుదరదని వెల్లడించారు. అయితే ఆయన కుటుంబసభ్యులు తమ ఆశను వదలక, ద్వితీయ అభిప్రాయం కోసం జీజీహెచ్‌సీ, చెన్నైకు వచ్చారు. రోగి ఊబకాయంతో బాధపడుతున్నప్పటికీ (130కేజీలు) ఈ మొత్తం ప్రక్రియ అతి మృదువుగా జరిగింది.
 
రోగి జీజీహెచ్‌సీకి చేరుకునే సమయానికి అపస్మారక స్థితిలో ఉండటంతో పాటుగా అతని బీపీ కూడా అతి తక్కువగా ఉండి డయాలసిస్‌ మీద ఉన్నారు. జీజీహెచ్‌సీ బృందం ఆయనను పరిశీలించిన మీదట ఆయన రక్తంలో ఫంగల్‌ వృద్ధి జరుగుతుందని, బహుళ సమస్యలు కూడా ఉన్నాయని గుర్తించి ప్రత్యేకమైన లీవర్‌ ఐసీయులో రెండు వారాలు ఉంచి అవసరమైన చికిత్స అందించారు. దీనితో పాటుగా 3-4 రోజులు 24గంటలూ డయాలిసిస్‌ చేశారు.
 
ఈ శస్త్రచికిత్స గురించి డాక్టర్‌ జాయ్‌ వర్గీస్‌, డైరెక్టర్-హెపటాలజీ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ హెపటాలజీ, గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ హెల్త్‌ సిటీ మాట్లాడుతూ, ‘‘ఈ శస్త్రచికిత్సలో కాలేయ, మూత్రపిండాల నిపుణులతో పాటుగా క్రిటికల్‌ కేర్‌ బృందం 14 గంటల పాటు కష్టపడింది. విజయవంతంగా ఈ రెండు అవయవాల మార్పిడి తరువాత రోగి స్పృహలోకి రావడంతో పాటుగా జీజీహెచ్‌సీలో చికిత్సను పొందానని తెలుసుకున్నారు. శస్త్రచికిత్స జరిగిన 16 వ రోజున రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశాం. రోగితో పాటుగా అతని సోదరి, భార్య కూడా ఆరోగ్యంగా ఉన్నారు’’అని అన్నారు.
 
ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్సకు డాక్టర్‌ జాయ్‌ వర్గీస్‌, డైరెక్టర్‌- హెపటాలజీ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ హెపటాలజీ; డాక్టర్‌ రజనీకాంత్‌ పచ్చా, క్లీనికల్‌ హెడ్‌-లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ, గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ హెల్త్‌ సిటీ; డాక్టర్‌ సెల్వకుమార్‌ మల్లీశ్వరన్‌, హెడ్‌ ఆఫ్‌ లివర్‌ ఐసీయు; డాక్టర్‌ కె మురుగనందమ్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌-యూరాలజీ అండ్‌ రెనల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జన్‌; డాక్టర్‌ పీ ముత్తుకుమార్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌- నెఫ్రాలజీ అండ్‌ రెనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌ నేతృత్వం వహించారు.