శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (13:47 IST)

కరోనా వ్యాక్సిన్ : జంతువులపై ప్రయోగం... సక్సెస్ అయితే....

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడుగా ఓ మందును తయారు చేస్తున్నారు. ఈ మందును హైదరాబాద్ నగరానికి చెందిన భారత్ బయోటెక్ ఫార్మీసి సంస్థ తయారు చేస్తోంది. ఇప్పటికే, ఒకటి, రెండు దశల్లో జరిగే ట్రయల్స్ పూర్తయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈ మందును జంతువులపై ప్రయోగం చేస్తున్నారు. ప్రయోగాలు సఫలమైతే ఈ యేడాది ఆఖరు నాటికి కరోనాకు వ్యాక్సిన్ సిద్ధమైనట్టే. 
 
ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్‌కు మందును కనిపెట్టే విషయంలో ప్రపంచ దేశాలతో పాటు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో కూడా నిమగ్నమైవున్న విషయం తెల్సిందే. ఈ మందుకోసం పలు దేశాలు సంయుక్తంగా కూడా కృషి చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ ఫార్మ‌సీ సంస్థ‌.. కోవిడ్‌19 టీకాను అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. కోరోఫ్లూ అనే వ్యాక్సీన్‌ను ప్ర‌స్తుతం టెస్టింగ్ చేస్తున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది. 
 
కోరోఫ్లూ మందుకు చెందిన ఒక చుక్కాను ముక్కులో వేస్తారు.  ఫ్లూ వ్యాక్సిన్ ఆధారంగా కోవిడ్‌19 ట్రీట్‌మెంట్ కోసం కొత్త త‌ర‌హా వ్యాక్సిన్‌ను త‌యారు చేయ‌నున్నారు. ఒకటి, రెండు ద‌శ‌ల్లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రిగిన‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. 
 
యూనివ‌ర్సిటీ ఆఫ్ విస్క‌న్‌స‌న్, మాడిస‌న్ వైరాల‌జిస్టుల స‌హ‌క‌రాంతో కోరోఫ్లూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి డోస్‌ల‌ను సుమారు 30 కోట్ల మందికి స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు ఆ కంపెనీ బిజినెస్ హెడ్ తెలిపారు.