1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2015 (12:20 IST)

మనిషికి పంది అవయవాల మార్పిడి.. సాధ్యమేనంటున్న వాషింగ్టన్ వైద్యులు!

సాధారణంగా ఒక మనిషి అవయవాలు ఒకరికి అమర్చడం వైద్య శాస్త్రంలో సాధారణమే. కానీ, పది అవయవాలను మనిషికి అమర్చడం సాధ్యమా? సాధ్యమేనంటున్నారు వాషింగ్టన్ శాస్త్రవేత్తలు. పైగా ఆ రోజు ఎంతో దూరంలో కూడా లేదని వారు ఘంటాపథంగా చెపుతున్నారు. 
 
ఇదే అంశంపై వారు మాట్లాడుతూ పది జన్యువుల్లోని రిట్రోవైరస్‌లను పని చేయకుండా (క్రియా రహితం) చేయడం వల్ల పంది అవయవాలను మనిషికి అమర్చడం సాధ్యపడుతుందని వారు చెపుతున్నారు. వాస్తవానికి రిట్రోవైరస్‌లు పందిలోని ప్రతి కణంలో అధికంగా ఉంటాయి. ఇవి పందికి ఎలాంటి హాని కలిగించవు. కానీ, మనిషి శరీరంలో ప్రవేశపెడితే మాత్రం అనేక రోగాలకు కారణమవుతాయి.
 
అపుడు మనిషి జీవితానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల పంది అవయవాల్లోని ఈ వైరస్‌లు పని చేయకుండా చేసి అమర్చవచ్చని చెపుతున్నారు. దీనికి సంబంధించిన పరిశోధనలు ఇప్పటికే విజయవంతమైనట్టు వారు చెపుతున్నారు. అందువల్ల త్వరలోనే పంది అవయవాలు మనిషికి కూడా అమర్చవచ్చని వాషింగ్టన్ వైద్యులు చెపుతున్నారు. ఇదే నిజమైతే... అవయవ మార్పిడి మరింత సులభతరం కానుంది.