ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 25 మే 2016 (14:39 IST)

ఫేస్‌బుక్‌లో మీ బేబీ ఫోటోను పోస్ట్ చేస్తే... ఏమవుతుందో మీకు తెలుసా..?

ఇపుడు సామాజిక నెట్వర్కింగ్ సైట్లను ఎడాపెడా ఉపయోగించడం ఎక్కువైంది. కొన్నిచోట్లు వెర్రితలలు కూడా వేస్తుందనుకోండి. ఐతే చాలామంది తమ బిడ్డల ఫోటోలను ఫేస్ బుక్ పేజీల్లో పోస్టు చేసి ఆ పోస్టుకు లైక్స్ ఎన్ని వచ్చాయో చూసుకుంటూ ఉంటారు. ఎక్కువ లైక్స్ వస్తే ఫర్వాల

ఇపుడు సామాజిక నెట్వర్కింగ్ సైట్లను ఎడాపెడా ఉపయోగించడం ఎక్కువైంది. కొన్నిచోట్లు వెర్రితలలు కూడా వేస్తుందనుకోండి. ఐతే చాలామంది తమ బిడ్డల ఫోటోలను ఫేస్ బుక్ పేజీల్లో పోస్టు చేసి ఆ పోస్టుకు లైక్స్ ఎన్ని వచ్చాయో చూసుకుంటూ ఉంటారు. ఎక్కువ లైక్స్ వస్తే ఫర్వాలేదు. కానీ తేడా వస్తే మాత్రం పాప తల్లిదండ్రుల ఆరోగ్యానికి మాత్రం చాలా సమస్యలు ఎదురవుతున్నట్లు ఇటీవల అధ్యయనాల్లో తేలింది. 
 
విషయం ఏంటయా అంటే... తల్లిదండ్రులు తమ బిడ్డల ఫోటోలను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసుకుని తమ బిడ్డకు ఎన్ని లైక్స్ వచ్చాయో చూసుకోడం అలవాటుగా ఉంటుంది. ఆ పోస్టులో బేబీ ఫోటోలకు లైక్స్ రాకపోయినట్లయితే తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా తల్లులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు తేలింది. అందువల్ల బిడ్డల ఫోటోలను సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేయవద్దని అధ్యయనకారులు వివరిస్తున్నారు.