Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో అధిక శక్తినిచ్చే పండ్ల రసాలు ఏవి?

Written By ఠాగూర్
Updated: సోమవారం, 12 ఏప్రియల్ 2021 (10:39 IST)
గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ వేడిమికి శరీరంలోని లవణాలన్నీ చెమల రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దీంతో మనిషికి నీరసం వస్తుంటుంది. ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ పండ్ల రసాలు, శీతలపానీయలాను నీటిని అధికంగా సేవిస్తున్నారు. అధికంగా నీళ్లు తాగడం, పళ్ల రసాలు తాగడం వల్ల ఎంతో మేలని వైద్యులు చెబుతున్న విషయం అందరికి తెలిసిందే. వీటి వల్ల ఆరోగ్యంగా ఉండటమేకాకుండా అలసిపోకుండా ఉంటాం. ఇంకా వడదెబ్బ నుంచి రక్షణ పొందుతాం.
 
వేసవిలో శక్తినిచ్చే పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ కాలంలో ఎండల వేడి నుంచి తట్టుకునేందుకు వివిధ పళ్ల రసాలు ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అలసిపోకుండా ఉంటాము. ఇంకా వడదెబ్బ నుంచి రక్షణ పొందుతాము.
 
ఇక వేసవిలో ఎక్కువగా దొరికేవి పుచ్చకాయ. నిమ్మకాయ, మామిడి, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శక్తిని కోల్పోకుండా ఉంటాము. వీటి వల్ల శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. ఎండాకాలంలో ఇవి తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
 
పండ్ల రసాలను సేవించడం వల్ల కలిగే ఉపయోగాలను పరిశీలిస్తే, ఈ పండ్ల రసాలతో విటమిన్‌-ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి, మలబద్దంగా సమస్య తొలగిపోతుంది, ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు, కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండ చేస్తాయి, చర్మానికి కొత్త యవ్వనం వచ్చేలా చేస్తాయి, పేగుల్లో మలినాలు తొలగిపోయి శుద్ది చేస్తాయి, ఎసిడిటి, అల్సర్‌ సమస్యను నివారిస్తాయి, నిమ్మకాయలు, పచ్చి మామిడి జ్యూస్‌లలో పోటాషియం బి6, బి1, బి2 విటమిన్స్‌ పుష్కలంగా అందుతాయి. అజీర్తి సమస్య దూరం అవుతంది. శరీరంలో నీటి శాతం పెరుగడం వల్ల బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. 
 
పుచ్చకాయలు ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. డయాబెటిస్‌ వ్యాధిని అదుపులో ఉంటుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలు తొలగిపోతాయి. ఇలా పండ్ల రసాలను ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో పండ్ల రసాలతోనే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని అంటున్నారు. దాహం ఎక్కువగా ఉండటం, అందులో అహారం తక్కువ తీసుకోవడం జరుగుతుందని, అందుకే ఇతర పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌లను తీసుకోవడం కంటే పండ్ల రసాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. 
 
ఈ పండ్ల రసాలతో ఇలాంటి ప్రయోజనాలే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు. ఈ జ్యూస్‌ల కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని, రక్తం శుద్ది అవుతుందని చెబుతున్నారు. వాటర్‌మిలన్‌ జ్యూస్‌ కాకుండా తీసుకుంటే ఇంకా ఎంతో మంచిదంటున్నారు. ఎండా కాలంలో ఎక్కువగా పండ్ల రసాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లోనే మొట్టమొదటి డైరెక్ట్ మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్ ఎల్బీ నగర్‌లో ఏర్పాటు

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ కేసు: తొలుత ప్రియురాలు మాధురి సూసైడ్ ఎటెంప్ట్, ఇప్పుడు అదే దారిలో భార్య

యూపీఐ చార్జీలు కాదు.. యూపీఐ ట్యాక్స్ : రాహుల్ గాంధీ

శృంగారానికి నిరాకరించిన ప్రియురాలు.. ఆవేశంతో చంపేసిన ప్రియుడు...

వేధింపులు భరించలేక మామను హత్య చేసిన కోడలు.. కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments