సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 2 జూన్ 2018 (12:53 IST)

తాటి ముంజలు ఎందుకు తినాలో ఈ 7 పాయింట్లు చూస్తే తెలుస్తుంది...

వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటిముంజలు ప్రత్యేకమైనవి. వీటిని పిల్లలు, పెద్దలు వయసుతో సంబందం లేకుండా అందరూ అమితంగా ఇష్టపడతారు. ఇవి కల్తీలేనివి, స్వచ్చమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం తాటిముంజలు. వేసవి సెలవలకు పల్ల

వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటిముంజలు ప్రత్యేకమైనవి. వీటిని పిల్లలు, పెద్దలు వయసుతో సంబందం లేకుండా అందరూ అమితంగా ఇష్టపడతారు. ఇవి కల్తీలేనివి, స్వచ్చమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం తాటిముంజలు. వేసవి సెలవలకు పల్లెటూర్లు వెళ్లేవారు తాటిముంజలని ఖచ్చితంగా లాగిస్తారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా ఇవి విరివిగా దొరుకుతున్నాయి. ఈ తాటిముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేస్తాయి. ఈ తాటి ముంజల్లో ఉన్న మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు  తెలుసుకుందాం. 
 
1. తాటి ముంజల్లో విటమిన్ బి7, విటమిన్ కె, సోలెబుల్ ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, జింక్, ఐరన్‌లతో పాటు న్యూట్రిన్స్ ఉంటాయి.
 
2. తాటి ముంజల్లో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిల్లో ఉండే అధిక నీటిశాతం శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేసి శరీరానికి చలువని అందిస్తాయి.
 
3. వీటిల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది.  
 
4. వేసవిలో వచ్చే తాటిముంజల్ని రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. తాటి ముంజలు తినడం వలన చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.
 
5. తాటి ముంజల్లో ఉండే పోషకాలు జీర్ణ సంబందిత సమస్యను తగ్గిస్తాయి. వీటిని తినడం వలన తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటి, కడుపు ఉబ్బరంగా ఉండే ఉదర సంబందిత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.
 
6. వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం, వాంతులను నివారిస్తుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ పాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే శరారంలోని అధిక బరువుని తగ్గించేందుకు తాటి ముంజలు ఎంతో సహాయపడతాయి.
 
7. తాటి ముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చర్మానికి కావల్సినంత తేమను అందించి వేసవి కాలంలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది. అలాగే ఎండ వేడిమి వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది.