ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2016 (16:20 IST)

స్వీట్లు తింటే మేలేంటి..? ఫంక్షన్లలో ఆహారానికి ముందు స్వీట్ తీసుకుంటున్నారా?

జువారీ డైట్‌లో స్వీట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారా? శుభకార్యాల్లో పెట్టే స్వీట్స్‌ను మీరెలా తీసుకుంటున్నారు.. ఆహారానికి ముందు తీసుకుంటున్నారా..? ఆహారానికి తర్వాత తీసుకుంటున్నారా? అసలు సంగతి ఏంటంటే..? స్వ

రోజువారీ డైట్‌లో స్వీట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారా? శుభకార్యాల్లో పెట్టే స్వీట్స్‌ను మీరెలా తీసుకుంటున్నారు.. ఆహారానికి ముందు తీసుకుంటున్నారా..? ఆహారానికి తర్వాత తీసుకుంటున్నారా? అసలు సంగతి ఏంటంటే..? స్వీట్స్‌ను ఆహారానికి ముందు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత చివరిగా స్వీట్స్ తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.
 
ఆహారం తీసుకునేందుకు ముందుగా ఆకలి కారణంగా పొట్టలో గ్యాస్ అధికంగా వ్యాపిస్తుంది. అలాంటి సమయంలో స్వీట్స్ తీసుకోవడం ద్వారా ఆ గ్యాస్ ప్రభావం మెల్లగా తగ్గిపోతుంది. ముఖ్యంగా పండ్లు తీసుకోవడానికి ముందు స్వీట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహారం జీర్ణమైన తర్వాత పొట్టలో నిల్వ ఉండే వ్యర్థాలతో ఏర్పడే వ్యాధుల సంఖ్య అధికమైపోతున్నాయని, స్వీట్స్‌ను తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.