మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 5 ఆగస్టు 2016 (20:56 IST)

పురుషులకు బెర్రీస్‌తో ఆ శక్తి... ఇంకా ఎన్నెన్నో సుగుణాలు...

బెర్రీస్‌లో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, చెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బిల్బెర్రీస్ మరియు రాస్బెర్రీస్ ఇలా వివిధ రకాలున్నాయి. బెర్రీ ఫ్రూట్స్ పురుషుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా పురుషులకు ఎంతో గొప్పగా సహాయపడుతాయి. పురుషుల్లో అన్ని రకాల ఆరోగ్య

బెర్రీస్‌లో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, చెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బిల్బెర్రీస్ మరియు రాస్బెర్రీస్ ఇలా వివిధ రకాలున్నాయి. బెర్రీ ఫ్రూట్స్ పురుషుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా పురుషులకు ఎంతో గొప్పగా సహాయపడుతాయి. పురుషుల్లో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఒక గొప్పగా మెడిసిన్‌లా పనిచేస్తాయి. ముఖ్యంగా లైంగిక సమస్యలను నివారించడంలో చాలా బాగా సహాయపడుతాయి. వివిధ రంగులున్న బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్, మరియు ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. బెర్రీస్ లో ఉండే ఈ ఫ్లేవనాయిడ్స్ పురుషుల్లో శీఘ్రస్కలనం, ఇతర లైంగిక సమస్యలను నివారించ‌డ‌మే కాకుండా ఇవి వయాగ్రా కంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
 
* బెర్రీస్ నేచురల్ వయాగ్రాల పనిచేస్తాయి. వీటిలో ఉండే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. కాబట్టి, పురుషులు స్ట్రాబెర్రీ ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. ఇతర బెర్రీస్ కూడా రెగ్యులర్‌గా తీసుకోవాలి. బెర్రీస్‌లో మెగ్నీషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్‌కు సహాయపడుతుంది. 
* బెర్రీస్ లివర్ మరియు కిడ్నీస్‌లో టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. దాంతో కిడ్నీలు, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఇంకా బరువు తగ్గించడంలో మెటబాలిజం రేటు పెంచడంలో సహాయపడుతుంది. 
* బెర్రీస్‌ను రెగ్యులర్‌గా తినడం వల్ల పురుషుల్లో ఎనర్జిటిక్ లెవల్స్ పెరుగుతాయి. అలసటను నివారించి, హై బ్లడ్ ప్రెజర్ మరియు గుండె జబ్బులను తగ్గిస్తాయి. బ్లడ్ వెజల్స్‌లో కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతాయి. దాంతో హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వంటి సమస్యలుండవు.
* బెర్రీస్ ప్రొస్టేట్ సమస్యలను నివారించడంలో సహాయపడుతాయి. బెర్రీస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రీషియన్స్ మరియు విటమిన్ కె వంటివి ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. 
* బెర్రిస్‌లో లూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. 
* బెర్రీస్ వల్ల శరీరంలోని లోయర్ పార్ట్స్‌కు రక్తప్రసరణను పెంచి, ఆక్సిజన్ మరియు న్యూట్రీషియన్స్‌ను పీనిస్‌కు సప్లై చేస్తుంది. దాంతో స్పెర్మ్ క్వాలిటి మరియు క్వాంటిని పెంచి పురుషుల్లో ఇన్ఫెర్టిలిటీని తగ్గిస్తుంది.
* బెర్రీస్ తినడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ నార్మల్ లెవల్స్‌కు వస్తుంది. బెర్రీస్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్ బ్లడ్ వెసల్స్‌ను మంచి ఆకారంలో ఉంచుతుంది. దాంతో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.
* బెర్రీస్‌లో ఉండే విటిమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటో కెమికల్స్ శరీరంలోని వ్యాధినిరోధకత పెంచుతుంది. దాంతో శరీరంలో ఇన్ఫెక్షన్స్ నివారించడానికి సహాయపడుతుంది. ఇంకా ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.