బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జనవరి 2025 (22:48 IST)

భారత్‌లో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్... ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త కేసులు..

HMPV
చైనాలో విస్తృతంగా ప్రబలుతున్న హ్యూమన్ మెటాన్యూమా వైరస్ ఇపుడు భారత్‌లో కూడా వ్యాపించింది. ఇప్పటికే బెంగుళూరు నగరంలో రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు తెలుస్తుంది. దీంతో దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. 
 
కర్నాటక రాష్ట్రంలో మూడు నెలల పసికందుకు, ఆరు నెలల బాలుడుకి ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే.  ఆరు నెలల బాలుడు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేస్తే హెచ్.ఎం.పి.వి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
మరోవైపు, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‍తో బాధపడుతున్న రెండు నెలల పసిబిడ్డను గత నెల 24వ తేదీన అహ్మదాబాద్ ఆస్పత్రిలో చేర్చగా ఆ బాలుడికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం.